![]() |
![]() |

'గుప్పెడంత మనసు' సీరియల్ ఇప్పుడు ఎపిసోడ్-666 లోకి అడుగు పెట్టింది. కాగా శనివారం జరిగిన ఎపిసోడ్ లో.. రిషి వసుధారలు గెస్ట్ హౌస్ లో ఉన్న విషయం తెలిసి దేవయాని.. "అసలు మీకెలా తెలుసు వాళ్ళు అక్కడ ఉన్నట్లు" అని మహేంద్రని అడుగుతుంది. అలా అనగానే వసుధార పంపిన వాయిస్ మెసేజ్ వినిపిస్తాడు మహేంద్ర. "ఇప్పుడు ఆ వసుధార మన బాధ్యతలు గుర్తు చేస్తుందా.. నిజంగానే రిషిని మీరు పట్టించుకోవడం లేదు. చిన్నప్పుడు జగతి రిషిని వదిలేసి వెళ్తే.. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను. ఇప్పుడు వసుధార వల్ల రిషి ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు" అని అంటుంది. అంతలోనే రిషి జగతికి ఫోన్ చేసి మేడం తొందరగా కాలేజీకి రండి మాట్లాడాలి అంటాడు. దానికి సరే అని బయలుదేరుతుంది.
మరో వైపు చక్రపాణికి ఫోన్ చేస్తాడు రాజీవ్. తనది తప్పేం లేదు అని చెప్పే ప్రయత్నం చేసినా.. వినకుండా చక్రపాణి రాజీవ్ ని తిడతాడు. "నువ్వు నా కళ్ళ ముందు లేవు కాబట్టి బ్రతికిపోయావు.. లేదంటే నిన్ను చంపేసేవాణ్ణి" అని చక్రపాణి అంటాడు. "నన్ను మీరు చంపలేరు మామయ్య.. ఎందుకంటే మీరు చాలా మంచివారు. ఒకసారి మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగాలని ఉంది" అని అనగానే చక్రపాణి ఫోన్ కట్ చేస్తాడు.
"వసుధారకి బాక్స్ ఇవ్వండి" అని రిషికి ఇస్తుంది పుష్ప. అంతలోనే రిషి దగ్గరికి జగతి వస్తుంది. ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. "నీ ఫ్లాట్ తాళం చెవి వసుధారకి ఇవ్వు. ప్రాజెక్ట్ హెడ్ గా తనకి ఫెసిలిటీస్ కల్పించడం మన బాధ్యత" అని జగతి చెప్తుంది.
రిషి, వసుధార ఇద్దరు మళ్ళీ ఎక్కడ ఒకటి అవుతారోనని దేవయాని ఆలోచిస్తూ ఉంటుంది. రాజీవ్ కి ఫోన్ చేసి " ఏరా ఎక్కడ చచ్చావ్" అని అనగానే .. "ఏరా అంటున్నావ్ ఏంటి" అంటూ కోపంతో మాట్లాడుతాడు రాజీవ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |